స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌లు మూడు కేసుల్లో 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి ముంబాయి వయా సికింద్రాబాద్ మీదుగా వెళ్లె కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లో గంజాయి రవాణ అవుతుందనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్సీడీ సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది కలిసి కోణార్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఖాజి పేట్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహిస్తూ వచ్చారు. అనుమానం వచ్చిన బ్యాగ్‌లో తనిఖీలు నిర్వహించగా మూడు గంజాయి ప్యాకెట్లు లభించాయి. కాని గంజాయిని తీసుకు వెలుతున్న వ్యక్తి మాత్రం తప్పించుకున్నట్లు సీఐలు తెలిపారు. పట్టుబడిన గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించి కేసు నమోదు చేశారు.
రెండో ఆటోల్లో గంజాయి స్వాధీనం..
వైఎంసీఏ నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆటోల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టి ఎఫ్బీ టీమ్ ఎస్సై బాలరాజు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు ఆటోల్లో 2.5 కేజీల గంజాయి పట్టుబడింది. విక్కి పటేల్ అనే వ్యక్తి ధూల్‌పేట్‌లో ఒక వ్యక్తి వద్ద 2.5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నారాయణగూడ వైఎంసీ ప్రాంతంలో సమంత్ అనే మరో ఆటో డ్రైవర్‌కు ఇస్తున్న క్రమంలో ఎక్సైజ్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని, రెండు ఆటోలను మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి నారాయణగూడ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
మరొకేసులో...
ధూల్ పేట రహింపూర ప్రాంతంలో ఓ ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా హెచ్టి ఎఫ్ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.
వారి వద్ద 1,518 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, ధర్మసింగ్, మహేష్‌సింగ్, మనోజ్‌సింగ్ లను అరెస్టు చేశారు.