అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో భర్తను హత్య చేసిన భార్య

By Ravi
On
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో భర్తను హత్య చేసిన భార్య

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం పరిధిలోని షాద్ నగర్ నియోజకవర్గంలో అక్రమ సంబంధం దారుణానికి దారి తీసింది. ఎరుకలి యాదయ్య అనే వ్యక్తిని అతని భార్య మౌనిక, ఆమె ప్రియుడు అశోక్ కలిసి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న యాదయ్య, తరచూ మద్యం సేవించి గొడవలు పెట్టేవాడు. అదే గ్రామ సమీపంలోని పత్తి మిల్లులో పని చేస్తున్న మౌనిక, అక్కడే మెస్‌కు కూరగాయలు సరఫరా చేసే అశోక్‌తో అక్రమ సంబంధం కొనసాగించింది.ఇద్దరి సంబంధం బయటపడుతుందన్న భయంతో, భర్తను మాయమయ్యేలా చేయాలని కుట్ర పన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన బంధువుల ఇంట్లో దావత్ ఉందని చెప్పి గూడూరు గ్రామం సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం, మద్యం మత్తులో ఉన్న యాదయ్యను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పటించి అక్కడినుంచి తప్పించుకున్నారు.హత్య చేసిన తర్వాత, యాదయ్య గల్లంతయ్యాడని మౌనిక స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దర్యాప్తులో అనుమానాలు పెరిగిన పోలీసులు విచారణ జరిపి మౌనిక, అశోక్‌లు నిందితులని నిర్ధారించి, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా