మహేష్ కోసం రాజమౌళి ప్లాన్ మార్చారా?
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 కూడా ఒకటి. అయితే ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి పలు షెడ్యూల్స్ జరుపుకున్నారు. అయితే, రాజమౌళి తన గత సినిమాలతో కంపేర్ చేస్తే.. ఈ ప్రాజెక్ట్ కోసం తన రూటు మార్చుకున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రాజమౌళి తన గత సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవారు.
కానీ మహేష్ బాబు సినిమాను మాత్రం ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ గానీ.. అప్డేట్ గానీ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా చాలా సింపుల్ గా చేశాడు. ఇక షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరే ఇతర అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయాలంటే అధికారికంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రజంట్ సైలెంట్ గా ఉండి ప్రమోషన్స్ నుండి ఆయన ఆలోచనలు ఛేంజ్ చేస్తారేమో అంటూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న ఇంకేదైనా స్పెషల్ గా ప్లాన్ చేశారా అనే డౌట్ కూడా ఆడియన్స్ లో కలుగుతుంది.