మహేష్ కోసం రాజమౌళి ప్లాన్ మార్చారా?

By Ravi
On
మహేష్ కోసం రాజమౌళి ప్లాన్ మార్చారా?

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్‌ లో వస్తున్న SSMB29 కూడా ఒకటి. అయితే ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి పలు షెడ్యూల్స్ జరుపుకున్నారు. అయితే, రాజమౌళి తన గత సినిమాలతో కంపేర్ చేస్తే.. ఈ ప్రాజెక్ట్ కోసం తన రూటు మార్చుకున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రాజమౌళి తన గత సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవారు. 

కానీ మహేష్ బాబు సినిమాను మాత్రం ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ గానీ.. అప్డేట్ గానీ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా చాలా సింపుల్‌ గా చేశాడు. ఇక షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరే ఇతర అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయాలంటే అధికారికంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రజంట్ సైలెంట్ గా ఉండి ప్రమోషన్స్ నుండి ఆయన ఆలోచనలు ఛేంజ్ చేస్తారేమో అంటూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న ఇంకేదైనా స్పెషల్ గా ప్లాన్ చేశారా అనే డౌట్ కూడా ఆడియన్స్ లో కలుగుతుంది.

Advertisement

Latest News

రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
జమ్మూకాశ్మీర్ ఘటనతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో బుధవారం కీలక భద్రతా విన్యాసాలు (మాక్ డ్రిల్స్) నిర్వహించనున్నారు. ఇటీవల...
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా
ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్