అఘోరీ మాత అరెస్ట్..!
By Ravi
On
అఘోరీ శ్రీనివాస్ మాత అరెస్ట్ అయ్యాడు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని యూపీకి వెళ్లి తలదాచుకున్నాడు. ఇప్పటికే ఆయనపై ఆంధ్రాలో వర్షిణీ తల్లిదండ్రులతోపాటు పలువురు కేసులు నమోదు చేయగా.. తెలంగాణలో మోకిల, శామీర్‌పేట్, శంకర్‌పల్లిలో కూడా కేసులు నమోదైయ్యాయి. వర్షణీని మూడో పెళ్లి చేసుకొని ఆమెను నరబలి ఇస్తున్నాడంటూ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు అఘోరీ శ్రీనివాస్ మాత కోసం తీవ్రంగా గాలించారు. పోలీసులు తనని వెతుకుతున్నారని తెలిసిన వెంటనే మాకొద్దు ఈ రెండు రాష్ట్రాలు అంటూ జంప్ అయ్యాడు. దీంతో పోలీసు బృందాలు టవర్ లొకేషన్ ఆధారంగా.. యూపీ పోలీసుల సహకారంతో అఘోరీని అరెస్ట్ చేశారు. అఘోరీ మాత నుంచి వర్షణీని సేఫ్‌గా ఇంటికి తరలిస్తున్నట్లు సమాచారం. అఘోరీ శ్రీనివాస్ మాతని మోకీల పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.