కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ..!

By Ravi
On
కాచిగూడలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ..!

యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివారు భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ. 3 కోట్ల నగదుతో ఉడాయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగాఉంచుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కాచిగూడ లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలో ఓ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వారం క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు, కోడలు విదేశీయాత్రకు వెళ్లారు. పారిశ్రామికవేత్త, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఆదివారం రాత్రి భోజనంలో పనివారు మత్తుమందు కలిపారు. దంపతులు మత్తులోకి వెళ్ల గానే.. ఇంట్లోని స్వర్ణాభరణాలు, నగదుతో ఉడాయించారు. నిత్యం మార్నింగ్ వాక్‌కు వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో.. సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపుతట్టారు. అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఆ తర్వాత దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం  రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు