ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్..

By Ravi
On
ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్..

టారిఫ్‌ అనే ఓ అణుబాంబుతో ట్రంప్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్నారు. పలు రంగాలపై టారీఫ్ ల మోత మోగించిన ఆయన.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు. ఫారెన్ లో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం టారీఫ్ లు వేస్తున్నట్లుగా లేటెస్ట్ గా మరో బాంబ్ పేల్చారు. కొందరు కావాలనే హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం అంటూ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్ చేశారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా నాశనం అవుతుంది. మా దర్శక, నిర్మాతలు, స్టూడియోలను యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్‌ నాశనమవుతుంది. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామని అందుకే ఈ ని్రణయం తీసుకుంటున్నట్లుగా ట్రంప్ పోస్ట్ లో రాసుకొచ్చారు. 

దీనిపై అమెరికా ట్రేడ్ మినిస్టర్ రెస్పాన్డ్ అవుతూ.. మేం దానిపై వర్క్ చేస్తున్నాం అని సమాధానమిచ్చారు. అయితే, అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్‌లు విధిస్తారా? ఓవర్సీస్‌లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది.

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!