ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్..

By Ravi
On
ఫారెన్ లో నిర్మించే సినిమాలపై 100% ట్రంప్ టారిఫ్..

టారిఫ్‌ అనే ఓ అణుబాంబుతో ట్రంప్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్నారు. పలు రంగాలపై టారీఫ్ ల మోత మోగించిన ఆయన.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు. ఫారెన్ లో షూట్ చేసి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం టారీఫ్ లు వేస్తున్నట్లుగా లేటెస్ట్ గా మరో బాంబ్ పేల్చారు. కొందరు కావాలనే హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం అంటూ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్ చేశారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా నాశనం అవుతుంది. మా దర్శక, నిర్మాతలు, స్టూడియోలను యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్‌ నాశనమవుతుంది. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామని అందుకే ఈ ని్రణయం తీసుకుంటున్నట్లుగా ట్రంప్ పోస్ట్ లో రాసుకొచ్చారు. 

దీనిపై అమెరికా ట్రేడ్ మినిస్టర్ రెస్పాన్డ్ అవుతూ.. మేం దానిపై వర్క్ చేస్తున్నాం అని సమాధానమిచ్చారు. అయితే, అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్‌లు విధిస్తారా? ఓవర్సీస్‌లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది.

Advertisement

Latest News

సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఇచ్చిన పిలుపు మేరకు, పాత తాలూకా కేంద్రమైన సూళ్లూరుపేటలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు గుమిగూడి నిరసన తెలిపారు. APTF సూళ్లూరుపేట...
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. 
నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..