భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ

By Ravi
On
భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నెక్ట్స్ చర్యలపై కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో నేడు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటి అయ్యారు. ఈ మీటింగ్ లో రెండు రోజుల టైమ్ లోనే జరిగిన మూడవ అత్యున్నత స్థాయి మీటింగ్ అని తెలుస్తుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు ప్రధాని మోడీ. లక్ష్యాలు, దాడి సమయం త్వరలోనే నిర్ణయిస్తామని సీసీఎస్‌ తెలిపింది. తాజాగా, యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండిగ్‌, టేకాఫ్‌ విన్యాసాలను కొనసాగించింది. 

కాగా, ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు సైనికంగా బదులివ్వలేదు. పాకిస్థాన్‌ ను అష్టదిగ్బంధం చేస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే.. బగల్హార్‌ జలాశయం నుంచి నీటి సరఫరాను ఆపేసింది భారత్‌. అలాగే, విద్యుద్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నుంచి నీరు వదలకపోవడంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సుకు సాగు నీరు అందడం లేదు. ఇక, జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుంచి కూడా నీటిని పాక్‌కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని మోడీ సర్కార్ ఆలోచనలో ఉంది.

Advertisement

Latest News

కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..! కేంద్రం నిర్ణయంతో పెరిగిన రేవంత్‌ పరపతి..!
- కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం- ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తి- కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా మార్మోగుతున్న రేవంత్‌ పేరు- కులగణనలో తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని విజ్ఞప్తి-...
సమ్మె వద్దు.. ఆర్టీసీ యాజమాన్యం లేఖ
ఆర్టీసీ ఆసుప‌త్రిలో డీఎన్‌బీ పీజీ మెడిక‌ల్ కోర్సులు
పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. గంజాయి, డ్రగ్స్ స్వాదీనం
ఊసరవెల్లి కాదు.. ఒకటే కలర్‌..!
కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!