వామ్మో.. మరీ ఇలా ఉన్నారేంట్రా?
ఐపీఎల్ లో అన్ని టీమ్స్ సిట్యూవేషన్ ఎలా ఉన్నా బెంగళూర్ టీమ్ రూట్ మాత్రం డిఫరెంట్. ఈ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా లేకున్నా.. ఆ టీమ్ పరిస్థితి మాత్రం ఛేంజ్ అవ్వట్లేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి బ్యాటర్స్ ఉన్నా కూడా టీమ్ ఛాంపియన్ గా ఉండట్లేదు. ప్రతి ఏడాది ఈ సాల కప్ నమ్దే అంటూ హడావిడీ చేయడం, మిడ్ సీజన్ లోనే ఏం చేయలేకపోవడం వీళ్లకి బాగా అలవాటైపోయింది. ఈ సీజన్ మాత్రం ఆర్సీబీకి అన్ని రకాలుగా ప్లస్ అయ్యింది. అపొనెంట్ టీమ్స్ ను దాటుకుంటూ సక్సెస్ అవుతూ వస్తుంది. అలాగే టీమ్ కి కావాల్సిన రన్ రేట్ ను మెయింటైన్ చేస్తుంది. ప్రజంట్ ఆర్సీబీ అకౌంట్ లో 16 పాయింట్స్ ఉన్నాయి. సో అఫీషియల్ గా ప్లేఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. దీంతో అభుమానుల్లో ఉత్సాహం డబుల్ అయ్యింది.
ఎప్పుడెప్పుడు కోహ్లీ టైటిల్ లిఫ్ట్ చేస్తాడా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి కూడా కప్ కొట్టకపోతే నా భార్యకు విడాకులిస్తానని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాన్డ్ అవుతుంటారు.. మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండండని ఒకరు పోస్ట్ పెడితే.. మరో నెటిజన్.. తన భార్య ఆర్సీబీ టైటిల్ కొట్టొద్దని దేవుడ్ని మొక్కుకుంటుందని సెటైరికల్ కామెంట్ చేశాడు. ఇదీ పరిస్థితి టీమ్ సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఈ రకంగా చెలరేగిపోతున్నారు.