భార్య ముక్కు కొరుక్కుతిన్న భర్త..!

By Ravi
On
భార్య ముక్కు కొరుక్కుతిన్న భర్త..!

పిచ్చి పరాకాష్టకి చేరడం అంటే ఇదేనేమో భార్యని చంపి ముక్కలుగా నరికి, పొడి చేసి చెరువులో కలిపేశాడు ఓ భర్త . అయితే  ఆమె ముక్కు బాగుందని కోసుకు తిన్నాడు మరో ప్రబుద్ధుడు.. ఇది నిజం.  తెలంగాణలోని మీర్ పేట్ లో  భార్యను ముక్కలు ముక్కలు చేసి ఉడికించి పౌడర్ చేసి చెరువులో పడేసిన ఘటన చోటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే భార్య అందంగా ఉందని ఓ భర్త చేసిన పని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భార్య అందంగా ఉండాలని ఏ భర్తకి అయిన అనిపిస్తుంది. భార్య అందంగా ఉంటే ఆనంద పడడం సహజమే కానీ. భార్య ముక్కు అందంగా ఉందని కోసుకు తిన్న ఈ దారుణమైన ఘటన బెంగాల్లోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఊహించని ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదేం పిచ్చి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శాంతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాపన్ షేక్ ఇంట్లో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేయడం స్థానికులు గమనించారు. దీంతో చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి వద్దకు వెళ్లి పరిశీలించగా.. ఇంట్లో నుంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చినంది. ఆమె ముక్కు నుంచి తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఏం జరిగిందని విచారించగా భర్త తన ముక్కును కొరుక్కుతిన్నాడని ఆమె చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానని భర్త అనేవాడని చివరకు అన్నంత పని చేశాడని లబోదిబో మంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ శాంతీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆమె భర్తను అరెస్ట్ చేసినట్టు సమాచారం

Advertisement

Latest News

సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఇచ్చిన పిలుపు మేరకు, పాత తాలూకా కేంద్రమైన సూళ్లూరుపేటలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు గుమిగూడి నిరసన తెలిపారు. APTF సూళ్లూరుపేట...
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. 
నీళ్లు ఆపితే అణ్వాయుధ దాడి.. పాక్ వార్నింగ్..