నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్..
ఐపీఎల్ 2025 సీజన్ క్రమంగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఈ సీజన్‌లో 51వ మ్యాచ్ నేడు గుజరాత్, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఇప్పటివరకు, టోర్నమెంట్‌లో గుజరాత్ టీమ్ ప్రజంటేషన్ బాగుంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో గుజరాత్ 6 గెలిచి 3 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత సీజన్‌లో పేలవమైన స్థితిలో ఉంది. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
దీంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే గుజరాత్, హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో 4-1 ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్‌లో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో GT గెలిచింది. పాయింట్ల లిస్ట్ గురించి చూస్తే.. గుజరాత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి టాప్-4లో ఉంది, అదే సమయంలో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.