హిట్ 3 సెన్సేషన్..
నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. ఈ సినిమా కోసం ఫస్ట్ నుండి అందరిలోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా వాటిని రీచ్ అయ్యే సెన్సేషనల్ వసూళ్లు కూడా అందుకుంటుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో కూడా హిట్ 3 అదరగొడుతుంది. మరి యూఎస్ మార్కెట్ అప్పుడే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ గ్రాస్ క్లబ్ లో చేరిపోవడం హైలెట్ గా నిలిచింది. అయితే కేవలం ఇది డే 1 న జరగడంతో సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పొచ్చు.
1 మిలియన్ 1 లక్ష డాలర్లు మార్క్ ని ఈ సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంది. ఇలా మొత్తానికి హిట్ 3 మేనియా యూఎస్ మార్కెట్ లో విధ్వంసం సెట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ కి ఈజీగా 2 మిలియన్ మార్క్ ని ఈ సినిమా దాటేస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే నాని సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా ఈ మూవీ నిలవబోతుంది. అలాగే నాని కెరీర్ లోనే మోస్ట్ అగ్రెస్సివ్ క్యారెక్టర్ చేయడంతో మరో హైలెట్ గా నిలిచింది.