టీజీబీసీఎల్ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) జనరల్ మేనేజర్‌గా గుండమనేని శ్రీనివాస్‌రావు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన జీఎం అబ్రహంకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ హరి కిరణ్ మాట్లాడుతూ, టీజీబీసీఎల్ జనరల్ మేనేజర్‌గా గుండమనేని శ్రీనివాస్ సమర్ధవంతంగా విధులను నిర్వహించి కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన అబ్రహం ప్రశాంతమైన రిటైర్డ్ జీవితం గడపాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు బి.ంశా, సి.హెచ్. ప్రమోద్, తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి, టీజీబీసీఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు జీటి జీవన్, జి. సురేందర్, హన్మంతు, గుడ్డు శ్రీనివాస్, రవి, పుష్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.