మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

By Ravi
On
మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో సిబిఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను టీఎన్జీవోస్ జీహెచ్ఎంసీ పార్క్‌ లో నిర్వహించారు. కార్యక్రమంలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు తమ దశాబ్దాల రాజకీయ అనుభవంతో రాష్ట్ర అభివృద్ధికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారన్నారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం వంటి రంగాల్లో ఆయన చేసిన కృషి మరపురానిదని తెలిపారు. యువతకు మార్గదర్శకుడిగా ఆయన ప్రేరణగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలో బండారి యాదగిరిIMG-20250420-WA0074 కాశీగారి యాదగిరి, యంజాల మహేష్ రాజు, ఏర్వ సత్యనారాయణ, తిరుమల వెంకటేష్, కుంకుల్లా దత్తు, శివ, నారాయణ, బాస శ్రీనివాస్, మహిపాల్, సీతారాం పాండు, గట్టయ్య, శేఖర్ గౌడ్, కొండల్, మహేందర్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, మధు, మునిగిపాటి వెంకటేష్, స్వామి గౌడ్, దేవేందర్, వడిగాచర్ల మల్లేష్, శరణమ్మ, పుష్ప, గౌతమి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!