కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మహేశ్వరం నియోజకవర్గంలోని మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 83 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "చెక్కులు తీసుకున్న కుటుంబాలు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రజల హక్కుల కోసం, హామీల నెరవేర్పు కోసం నిరంతరం పోరాడతాం," అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎమ్మార్వో, మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ జ్ఞానేశ్వర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అరకల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, శీను నాయక్, బొక్క రాజేందర్ రెడ్డి, మదారి రమేష్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, పంతంగి మాధవి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.