బీసీసీఐకి బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

By Ravi
On
బీసీసీఐకి బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

ప్రజంట్ ఐపీఎల్ మ్యాచ్ లు మంచి రసవత్తరంగా జరుగుతున్నాయి. మ్యాచ్ తర్వాత మైదానంలో రోబో చంపక్ చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. క్రికెటర్లతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఎవరేం చెప్పినా చేస్తూ.. మాట వింటుంది. ఆ మధ్య సునీల్ గవాస్కర్ ఈ చిట్టి రోబోతో చేసిన సందడి నెట్టింట వైరల్ గా మారింది. ధోనీ, కేఎల్ రాహుల్, అయ్యర్, పాండ్యా ఇలా ప్రతిఒక్కరు ఆ చిట్టి రోబోకి ఫ్యాన్ అయిపోయారు. ఈ రోబో ప్రాక్టీస్ టైమ్ లో క్రికెటర్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది. కానీ బీసీసీఐని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు పంపేలా చేసింది. 

అసలేం జరిగిందంటే.. బీసీసీఐ ఫ్యాన్‌ పోల్‌ ద్వారా దానికి చంపక్‌ అన్న పేరు పెట్టింది. అయితే ఆల్రెడీ కిడ్స్ కు సంబంధించి చంపక్ అనే మ్యాగ్జైన్ ఉండటంతో.. ఆ మ్యాగజైన్ నిర్వాహకులు ఆ రోబోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్మిషన్ తీసుకోకుండా చంపక్ అనే పేరుని వాడుకుని వాళ్ళ ట్రేడ్‌మార్క్‌ ని బ్రేక్ చేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ కోర్టు జూలై 9 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం