పహల్గాం ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

By Ravi
On
పహల్గాం ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఘటన దేశమంతటా భారీగా సంచలనం రేకెత్తించింది. ప్రపంచ దేశాలు సైతం ఈ ఘటనను ఖండించింది. ఈ క్రమంలో ఈ ఘటనపై న్యాయ విచారణకు గాను సుప్రీంకోర్టులో పిల్ ను దాఖలు చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణను సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఉగ్రవాద దాడి ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారని పేర్కోంది. ఇది దేశానికి చాలా క్లిష్టమైన సమయమని, ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలని సూచనలు చేసింది. 

అంతేకాకుండా భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అంటూ ఈ క్రమంలో సుప్రీంకోర్టు పిటీషనర్ ను క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని మందలించింది. కాగా కోర్టు సూచనలతో పిటీషనర్ పిల్ ను ఉపసంహరించుకున్నారు. కాగా దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే పహల్గాం ఘటన కారణంగా భారత్, పాక్ పై కఠిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Latest News