రెట్రో దూకుడు.. ఈసారి సూర్య అకౌంట్ లో బ్లాక్ బస్టర్ హిట్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు వారు మరింతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 200K కి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియెన్స్. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు. స్పెషల్లీ తన లుక్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. పైగా ఈ సినిమా సూర్య కెరీర్ లో చాలా కీలకంగా మారే సినిమాగా కావడం కూడా గమనార్హం.