రాజమౌళి, మహేష్ ల సినిమా రిలీజ్ పై నాని క్లారిటీ?
డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, తాజాగా హీరో నాని ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. హిట్ 3 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ఇంకో ఏడాదిలో రాబోతోందని, సినిమాను ప్రపంచమంతా చూసి తీరాల్సిందేనని హీరో నాని అన్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సో పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఇంట్రెస్టెట్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నోవల్ రైటర్ విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి, మహేష్ ల సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.