సూర్య ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సెట్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి ఎప్పట్నుండో ట్రై చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. పైగా సూర్యతో వెంకీ అట్లూరి తన సినిమాని స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సెట్ వేస్తున్నారని.. ఈ సెట్ లో సూర్య పై ఓపెనింగ్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడు. జీవి ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు.
దీనికోసం దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారట. చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ కాయదు లోహర్ ను తీసుకోబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.