సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు

By Ravi
On
సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు

గడ్డి అన్నారం,సరూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం మరియు మొగలపల్లి ఉపేందర్ గుప్త ఆధ్వర్యం లో  కొత్తపేట లోని కన్యక పరమేశ్వరి దేవాలయం లో  భారత దేశ సైనికుల కోసం, పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి కోసం, భారతదేశ ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని సుదర్శన సంహిత లక్ష్మి నరసింహస్వామి మహా మృత్యుంజయ, శత్రుంజయ,బుణ విమోచన యజ్ఞం నిర్వహించారు.కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేమమైన చర్యని ఉపేందర్ గుప్త మండిపడ్డారు. సనాతన అఖండ భారతదేశం మళ్లీ పునర్ నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. IMG-20250427-WA0059

హిందువులనే టార్గెట్ చేసుకొని తీవ్రవాదులు అత్యంత దారుణం గా కాల్చివేయడం మనస్సు కలిసివేసిందని నాగరాజ్ స్వామి అన్నారు.

హిందువులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని తీవ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

భవిష్యత్తులో ఉగ్రవాదులు దాడి చేయాలంటే భయపడే స్థితి లో ప్రతి చర్య ఉండాలని అన్నారు.

Tags:

Advertisement

Latest News