మెగాస్టార్ సిస్టర్ క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఐతే, ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార యాక్ట్ చేయనున్నట్లు, కానీ ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు న్యూస్ వైరల్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ ఉందని.. ఈ పాత్ర చాలా ఎంటర్టైనింగ్ టోన్ లో సాగుతుందని.. ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించబోతుందని టాక్ నడుస్తోంది. ఈ రూమర్ వినగానే ఆడియన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
సెకండ్ హాఫ్ లో చిరంజీవి క్యారెక్టర్ కి స్పెషల్ యాస అండ్ బాడీ లాంగ్వేజ్‌ను అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నారట. అదేవిధంగా సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ అని, ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని కూడా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.