హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, మరియు నిర్వాహకులు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ "రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలపై హనుమంతుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన దయతో ప్రతి ఒక్కరి జీవితం విజ్ఞానంతో నిండాలి. భక్తి భావం మన అందరిలో ఉండాలి." అని ఆన్నారు.
ఈ పూజా కార్యక్రమానికి అనేక మంది భక్తులు హాజరై హనుమంతుని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.