ఇస్రో మాజీ ఛైర్మన్ మృతి బాధాకరం : మోదీ
By Ravi
On
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరీ రంగన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశపు శాస్త్రీయ, విద్యాపరమైన ప్రయాణంలో కస్తూరిరంగన్ ఎంతో కీలకమైన వ్యక్తని ప్రధాని చెప్పారు. కస్తూరీరంగన్ దార్శనిక నాయకత్వాన్ని, ఆయన నిస్వార్థ సేవను ఈ దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు. ఇస్రో ఛైర్మన్‌గా కస్తూరీరంగన్ భారతదేశపు అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని ప్రధాని మోదీ చెప్పారు.
కాగా కస్తూరీ రంగన్ లాంటి మహనీయుల కృషి వల్లనే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయని తెలిపారు. ప్రధానంగా ఆయన నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్టు పెట్టారు.
Latest News
11 May 2025 11:44:41
లక్షలు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ లు చేస్తారు. వచ్చిన అతిథులకు తమ దర్పం చూపించుకోవడానికి మద్యం మాంసం బిర్యాని పెడతారు. కానీ తెలంగాణ మద్యం వాడకుండా...