దుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

By Ravi
On
దుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.దుండిగల్ ఓఆర్‌ఆర్ వద్ద మేడ్చల్ SOT సహకారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రెండు వాహనాల్లో రహస్యంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని గుర్తించారు. ఆపరేషన్‌లో మొత్తం 94 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ సుమారు 33 లక్షలు.ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి గంజాయిని తెలంగాణ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు సరఫరా చేస్తుండగా ఇద్దరు డ్రగ్ ఫెడర్లు షేక్ మునావర్, గంటసాల జగదీష్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే మూడవ నిందితుడు దేవా సచిన్ పరారీలో ఉన్నాడు.అరెస్టయిన వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా