వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!

By Ravi
On
వైల్డ్‌ హార్ట్స్‌ పబ్‌లో అశ్లీల నృత్యాలు..!

హైదరాబాద్‌ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్స్‌ పబ్‌పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలతోపాటు జనాలను ఆకర్షించడానికి ఉద్దేశించిన అభ్యంతరకరమైన ప్రదర్శనలను బయటపెట్టారు. పోలీసులు కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువతను ఆకర్షించడానికి పబ్‌లో రెచ్చగొట్టే అభ్యంతరకరమైన డ్యాన్స్ షోలను నిర్వహింస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ ఫుట్‌ఫాల్ మరియు లాభాలను పెంచడానికి మేనేజ్‌మెంట్ ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేసిందని పోలీసులు ఆరోపించారు. ఈ దాడుల్లో ప్రదర్శనలో పాల్గొన్న ముంబైకి చెందిన 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు పబ్ యజమాని, పలువురు కస్టమర్లను కూడా అరెస్ట్‌ చేశారు. లైసెన్సింగ్ ఉల్లంఘనలతోపాటు మానవ అక్రమ రవాణాతో సహా పబ్ కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  విచారణ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

Advertisement

Latest News

ఘోర రోడ్డు ప్రమాదం. కానిస్టేబుల్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు ఘోర రోడ్డు ప్రమాదం. కానిస్టేబుల్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు
శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాని  లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ కుమార్...
కవిత కొత్త పార్టీ.. గిదైతే ఫైనల్..
నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్