రైతు బజార్‌లో దర్శనమిచ్చిన బతుకమ్మ చీరలు..!
By Ravi
On
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో బతుకమ్మ చీరల కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని రైతుబజారులో ఎవరు పడేశారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లోని అధికారులకు అందజేయలేదు. వాటినే తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతుబజారుకు తీసుకొచ్చి వృథాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చీరలను చిన్నారులు ఇక్కడి షెడ్లకు కట్టి ఊయలలా వాడుతున్నారు. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు చెబుతున్నారు. మరోవైపు ఈ చీరలను రైతుబజారులో ఎవరు పడేశారో తమకు తెలియదని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.
Tags:
Related Posts
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...