బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

By Ravi
On
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి

హైదరాబాద్‌: బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం మరొక ప్రాణాన్ని బలి తీసుకుంది. చలానా రాయడానికి రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే, బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ పోలీసులు ఓ బైక్‌ను ఆకస్మికంగా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అదుపుతప్పిన బైక్ కిందపడింది. ఆ బైక్‌ను నడుపుతున్న వ్యక్తి తలపై ఆర్టీసీ బస్సు నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

ఈ ఘటనతో ఆగ్రహించిన వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Latest News

నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దృష్టిసారించి దాడులు ముమ్మరం చేసి గంజాయితోపాటు డ్రగ్స్‌ను అరికట్టాలని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశాలు జారీ చేశారు....
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..
మిస్‌ ఫైర్‌.. ఇజ్రాయిల్ ప్రజలపై బాంబు?
చైనాకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అమెరికా
వారికి రూ.10లక్షలు సాయం ప్రకటించిన బెంగాల్ సీఎం