జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా బాలపూర్ చౌరస్తాలో ఘనంగా పలువురు నివాళులు

By Ravi
On
జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా బాలపూర్ చౌరస్తాలో ఘనంగా పలువురు నివాళులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో  జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బాలికల విద్య కోసం పెద్దపీట వేశారని అందుకె  ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని చదివించి ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడని చెప్పారు.అదే స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి బాలికల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు. భారతదేశంలో చదువులో అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉందని అందుకు పాఠశాల నుంచి మొదలుకొని యూనివర్సిటీల వరకు అమ్మాయిలే చదువును కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. అలా చదువుకోవడం వల్లనే మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని ఆమె అన్నారు. మహనీయుల విగ్రహాలకు దండ వేసి దండం పెట్టడం కాదు వారి ఆశయాలను కొనసాగించాలని ఆమె కోరారు. 

Tags:

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..