ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

By Ravi
On
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు


మాజీ పోలీసు అధికారి ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో ప్రభాకర్‌రావే కీలకమని కౌంటర్ కాపిలో పేర్కొన్నారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ఆయనేనని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇది పనిచేసిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఫోన్‌ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా ఎస్‌వోటీ విధులు నిర్వహించిందన్నారు.ట్యాపింగ్‌తో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారన్నారు. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇచ్చారని చెప్పారు. ఐపీఎస్‌ అధికారిగా పదవీ విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో విధిలేక ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారని.. తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు  భారత్‌కు తిరిగి రాలేదన్నారు. అందుకే ఆయన బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని.. దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అనంతరం విచారణ ఈనెల 15కు కోర్టు వాయిదా వేసింది.

Tags:

Advertisement

Latest News

తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..! తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారు.. జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్ ఎంప్లాయిస్ ఆవేదన..!
జీహెచ్ఎమ్‌సీ టౌన్‌ ప్లానింగ్‌లోని కిందిస్థాయి దళిత ఉద్యోగ సిబ్బందిని.. తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్‌సీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వ...
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..!
ఏఐ వీడియోస్‌పై హైకోర్టులో రేవంత్‌ సర్కార్‌ పిటిషన్..!
అనుకృష్ణ ఆస్పత్రికి రూ. 5లక్షల జరిమానా.. లైసెన్స్ రద్దు..!
ఘనంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలు..!
అక్రమంగా బాడీ బిల్డింగ్‌ స్టెరాయిడ్స్‌ విక్రయాలు