మరోసారి దాతృత్వం చాటుకున్న రాఘవేంద్రరావు
ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడంలో ముందుండే బొండాడ రాఘవేంద్రరావు.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే బచ్చు కుటుంబరావుకి ఆర్థిక సాయం అందించారు. అవనిగడ్డ మండలం దక్షిణ చిలువోలులంక గ్రామానికి చెందిన బచ్చు కుటుంబరావు.. కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నాడు. ట్రీట్‌మెంట్ చేయించుకునే ఆర్థిక స్తోమత లేక.. దాతల గురించి ఎదురుచూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బొండాడ.. తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కుటుంబరావుకు బొండాడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు రూ. 25,000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని కుటుంబరావు భార్య మాధవి ఇండియన్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారి సేవా ధోరణిని పలు గ్రామాల ప్రజలు హర్షాభిమానాలతో అభినందిస్తున్నారు. ఆయన ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.