రైతు బజార్‌లో దర్శనమిచ్చిన బతుకమ్మ చీరలు..!

By Ravi
On
రైతు బజార్‌లో దర్శనమిచ్చిన బతుకమ్మ చీరలు..!

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో బతుకమ్మ చీరల కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని రైతుబజారులో ఎవరు పడేశారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లోని అధికారులకు అందజేయలేదు. వాటినే తాండూరులో నిరుపయోగంగా ఉన్న పాత రైతుబజారుకు తీసుకొచ్చి వృథాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చీరలను చిన్నారులు ఇక్కడి షెడ్లకు కట్టి ఊయలలా వాడుతున్నారు. వీటిని పేదలకు పంపిణీ చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని పట్టణ వాసులు చెబుతున్నారు. మరోవైపు ఈ చీరలను రైతుబజారులో ఎవరు పడేశారో తమకు తెలియదని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..! సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!
సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  మనీలాండరింగ్‌తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు...
కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!