బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
- ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్ భూదందాలు
- ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్
- నార్త్ బ్యూరోక్రాట్స్ అడ్డగోలు భూముల కొనుగోలు
- డ్యూటీలో జాయిన్ అవ్వకముందు.. ప్రస్తుత ఆస్తుల వివరాలు సేకరణ
- కొత్తగా డ్యూటీలో చేరి కోటీశ్వరులైన వారి చిట్టా సిద్ధం
- మేడ్చల్ భూదాన్‌లో భూములు కోనుగోలు చేసిన సౌత్ అధికారులు
- ఉన్నతాధికారులకు అందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్
హైదరాబాద్ శివార్లలో బ్యూరోక్రాట్స్ భూముల కొనుగోళ్ల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సౌత్ అధికారులతో పోటీ పడి నార్త్ అధికారులు అడ్డదిడ్డంగా భూములు కొనుగోలు చేశారు. ఈ విషయంపై ట్రూ పాయింట్ న్యూస్ ఈనెల 23న తెలుగు, ఇంగ్లీష్ పేపర్లో ముందే చెప్పింది. హైదరాబాద్ శివార్లలో భూములు కొన్న బ్యూరోక్రాట్స్ అంటూ శీర్షిక ప్రచురించింది. తాజాగా సౌత్‌లో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మేడ్చల్‌లో భూదాన్ భూముల కొనుగోలు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ బినామీ పేర్ల మీద కొనుగోలు చేసిన ఎకరాల వివరాలపై కేంద్ర ఇంటలీజెన్సీ నివేదిక పైఅధికారులకు అందించినట్లు సమాచారం. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు బ్యూరోక్రాట్స్ ఆస్తుల వివరాలు.. ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలు సేకరించారు. కొత్తగా డ్యూటీలోకి వచ్చి ఏడాదిలోనే కోటీశ్వరులైన వారి చిట్టా కూడా సేకరించింది. డీవోపీటీ ఇచ్చిన వివరాలు, ఇప్పుడు ఉన్న వివరాలపై ఆధారాలు సేకరించి ఆయా ఆఫీసర్ల డాక్యుమెంట్లు జత చేసి మరీ పంపింది.
తాజాగా బయటపడిన సౌత్‌కు చెందిన అధికారులు ఎవరెవరు..? మేడ్చల్‌లో భూదాన్ బోర్డులో భూములు కొనుగోలు చేసింది ఎవరు..? మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు 181,182,194,195లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారుల వివరాలు ట్రూ పాయింట్ న్యూస్‌లో మీ కోసం..
ఇక భూదాన్ బోర్డులో భూములు కొనుగోలు చేసిన బ్యూరోక్రాట్స్ చిట్టా ఈ విధంగా ఉంది.. 1) బత్తుల హేమలత C/o బత్తుల శివధర్ రెడ్డి IPS-20 గుంటలు, 2) ప్రియాంక రతన్ C/o దివంగత రాజీవ్ రతన్ IPS-16 గుంటలు, 3) రవి గుప్త IPS-16 గుంటలు,
4) ముదిరెడ్డి నితీష్ రెడ్డి S/o మహేందర్ రెడ్డి IPS-20 గుంటలు, 5) తాటిపర్తి పావని రావు C/o T.ప్రభాకర్ రావు IPS-16 గుంటలు, 6) రేఖ షరాఫ్ C/o ఉమేష్ షరాఫ్ IPS-16 గుంటలు, 7) రాజర్షి సాహా IPS-8 గుంటలు, 8) స్వాతి లక్రా IPS-16 గుంటలు, 9) మిట్టీ సతితి సుహానా C/o మిట్టీ శ్రీనిబసు-8 గుంటలు, 10) నందిని మాన్ C/o విక్రమ్ సింగ్ మాన్ IPS-8 గుంటలు, 11) డాక్టర్ జ్ఞాన్ ముద్ర C/o సోమేష్ కుమార్ IAS-20 గుంటలు, 12) బీకే రాహుల్ హెగ్డే -8 గుంటలు, 13) సవ్యసాచి ప్రతాప్ సింగ్ C/o గోవింద్ సింగ్-8 గుంటలు, 14) అనిరుధ్ C/o సుధీర్ బాబు IPS-నాట్ స్పెసిఫైడ్, 15) ఇందు రావు కావేటి C/o లక్ష్మీనారాయణ రావు కావేటి-16 గుంటలు, 16) న్యాలకొండ సింధు రెడ్డి C/o న్యాలకొండ ప్రకాష్ రెడ్డి-20 గుంటలు, 17) ఐశ్వర్య రాజ్ C/o వికాస్ రాజ్-20 గుంటలు, 18) వెన్నవెల్లి రాధిక C/o కమలాసన్ రెడ్డి-16 గుంటలు, 19) రీతా సుల్తానా C/o సందీప్ కుమార్ సుల్తానా-20 గుంటలు, 20) వసుంధర సిన్హా C/o అంజనీ కుమార్-20 గుంటలు, 21) ముత్యాల వినీల C/o స్టీఫెన్ రవీంద్ర IPS-8 గుంటలు, 22) అజిత్ కుమార్ మొహంతి C/o ఖేస్త్రబాసి మొహంతి-20 గుంటలు, 23) నవీన్ మిట్టల్ సెల్ఫ్-20 గుంటలు, 24) సౌమ్య మిశ్రా సెల్ఫ్-16 గుంటలు, 25) రాహుల్ బుసి రెడ్డి S/o బీ జనార్దన్ రెడ్డి IAS-16 గుంటలు, 26) తరుణ్ జోషి IPS సెల్ఫ్ -16 గుంటలు, 27) పీర్ల వరుణ్ C/o పీర్ల విశ్వ ప్రసాద్-16 గుంటలు, 28) తోట శ్రీనివాసరావు S/o తోట సాయిబాబా IPS-నాట్ స్పెసిఫైడ్, 29) కొండూరు శ్రీనాథరాజు S/o కొండూరు సత్యనారాయణ-20 గుంటలు, 30) మహేష్ భగవత్ IPS సెల్ఫ్-16 గుంటలు, 31) రేణు గోయల్ C/o కమాండర్ జితేందర్ కుమార్ గోయల్-20 గుంటలు, 32) అజయ్ జైన్ సెల్ఫ్-20 గుంటలు, 33) అమిత్ కుమార్ C/o అనిల్ కుమార్-20 గుంటలు. ప్రస్తుతం ఈ అధికారుల చిట్టా బయటికొచ్చింది. ఇంకా మిగతా అధికారులు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొనుగోలు చేసిన ఆధారాలు మరో శీర్షికలో ట్రూపాయింట్ వెలుగులోకి తీసుకొస్తుంది.