ఆర్సీబీ ఫెయిల్యూర్ రికార్డ్ కు కారణం ఏంటంటే..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు హోం అడ్వాంటేజ్ కలిసి రాలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. కేఎల్ రాహుల్ చేతిలో ఆర్సీబీకి ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఐదు మ్యాచుల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ ఆడియన్ గ్రౌండ్స్ బయటకి కావడం హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్సీబీ ఓ ఫెయిల్యూర్ రికార్డును తన అకౌంట్ లో వేసుకుంది. ఇప్పటివరకు డీసీ పేరిటే ఉన్న ఆ రికార్డు ఇప్పుడు బెంగళూరు పేరుకు ట్రాన్ఫర్ అయ్యింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన ఫస్ట్ టీమ్ గా నిలిచింది.
ఈ క్రమంలో రజత్ పటీదార్ మాట్లాడుతూ.. మేం మ్యాచ్ ఆరంభంలో చూసిన పిచ్.. ఆట సాగిన కొద్దీ మార్పులకు చోటు చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం. కానీ, ఆడిన కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మా బ్యాటర్లు మంచిగా బ్యాటింగ్ చేశారని అనుకోవడం లేదు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ డిఫరెంట్ గా రెస్పాన్డ్ అయ్యింది. తప్పకుండా రాబోయే మ్యాచ్‌కు ముందే ప్లాన్ చేసుకుంటాం. మిస్టేక్స్ జరగకుండా చూస్తాం. టిమ్ డేవిడ్ ఆఖర్లో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. పవర్‌ప్లేలో మా బౌలర్లు అద్భుతంగా వేశారు. క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు నిత్యం ట్రై చేస్తామని బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు.