సీఎస్‌కే విజయాల బాట: రుతురాజ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు గాయం వల్ల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నారు. రుతురాజ్ టోర్నీ నుంచి వెళ్లిపోవడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ ఛార్జ్ తీసుకున్నారు. ధోనీ కెప్టెన్సీపై రుతురాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రెస్పాన్డ్ అయ్యారు. సీఎస్‌కేకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకెళ్తాడని అన్నారు. తప్పకుండా సీఎస్‌కే మళ్లీ సక్సెస్ అవుతుందని, ఈ క్రమంలో తన సపోర్ట్ ఉంటుందని అన్నారు.
ఈ క్రమంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2025కు దూరం కావడం నిరుత్సాహానికి గురిచేస్తోంది. మోచేయి గాయం కారణంగా టోర్నీలో ఆడలేకపోతున్నా. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. ఈ సీజన్ మాకు సవాల్ తో ఉంది. అయితే మాకు ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు. అతడు టీమ్ ను తన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తాడు. తప్పకుండా చెన్నై మళ్లీ సక్సెస్ అవుతుంది. నేను టీమ్ తోనే ఉంటా, డగౌట్ నుంచి నా సపోర్ట్ ఇస్తా. కఠిన పరిస్థితుల నుంచి చెన్నై బయటపడటం చూడాలనుంది’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.