గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..

By Ravi
On
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విజృంభించింది. తాజాగా నిన్న షెజైయాలో జరిపిన దాడి ఘటనలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు అధికారికంగా ప్రకటించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనీయన్లు మరణించారని అధికారులు తెలిపారు. చాలామంది గాయపడ్డారని.. చాలా మంది శిథిలాల్లో చిక్కుకున్నారని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు కానీ.. అయినా పౌరులకు నష్టం జరిగిందని అన్నారు. 

మొత్తానికి బుధవారం నాడు మృతుల సంఖ్య 38కి చేరుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఈ క్రమంలో సీనియర్ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ అతని పేరు బయటకు రానివ్వలేదు. పౌరులకు హాని కలగకుండా.. ముందుగా అనేక చర్యలు తీసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఎన్‌క్లేవ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మరో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు కూడా నిర్ధారించారు. ఈ క్రమంలో మరణాల సంఖ్య 38కి పెరిగినట్లు పేర్కొంది.

Advertisement

Latest News

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు