విడాకులపై స్పందించిన మిచెల్ ఒబామా

By Ravi
On
విడాకులపై స్పందించిన మిచెల్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు విడిపోతున్నారని సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది. కాగా ఒబామాతో కలిసి మిచెల్ పలు కార్యక్రమాలకు అటెండ్ కాలేదు. దీంతో ఈ రూమర్స్ కు అదే కారణం అయ్యింది. అంతేకాకుండా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోవడంతో ఈ రూమర్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. కాగా ఒబామా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇబ్బందులు ఉన్నట్లుగానే చెప్పారు. లేటెస్ట్ గా మిచెల్ ఒబామా కూడా ఈ రూమర్స్ కి రెస్పాన్డ్ అయ్యారు. ఓ పాడ్‌కాస్ట్‌ లో నటి సోఫియా బుష్‌తో మిచెల్ ఒబామా  మాట్లాడారు. ఈ సందర్భంగా విడాకులపై వస్తున్నా రూమర్స్ కు బ్రేక్ వేశారు. 

తమ మధ్య అలాంటిదేమీ లేదని మిచెల్ కామెంట్ చేశారు. తన వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా చెప్పారు. అందుకే బయటికి ఎక్కడికి వెళ్లడం లేదని ఆమె అన్నారు. వైట్‌హౌస్‌ ను విడిచిపెట్టిన దగ్గర నుంచి ఈ ఎనిమిదేళ్లలో తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. కుమార్తెలు పెద్దవాళ్లు కావడంతో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయన్నారు. తన ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడానికి స్వేచ్ఛ లభించిందని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఒబామా రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా వర్క్ చేశారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్  పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్ మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా  భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..
పహల్గాం అటాక్.. 'రెండు నెలలు ఆహారం నిల్వ చేసుకోండి..' 
నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ..