వారం రోజులే మీకు టైం.
By Ravi
On
వాటర్ వర్క్స్ అధికారులకు ఎమ్మెల్యే సబిత వార్నింగ్
వాటర్ వర్క్స్ అధికారులకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. గత వారం రోజులుగా మంచినీరు రావడం లేదని ఓ మహిళ కంట తడిపెట్టుకుంది. దీనికి చలించిపోయిన ఎమ్మెల్యే వాటర్ వర్క్స్ అధికారులపై మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరు మంచినీరు, కరెంట్ సమస్యలతో బాధపడలేదని, కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదన్నారు. సీఎం కి HCU భూములపై ఉన్న ప్రేమ జనాల సమస్యలపై లేదని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
Related Posts
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...