జగన్‌పై ఘాటుగా స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్..

By Ravi
On
జగన్‌పై ఘాటుగా స్పందించిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాయలసీమలోని రామగిరి ఎస్‌ఐ జి. సుధాకర్ యాదవ్ ఘాటుగా స్పందించారు. తన అధికార హోదా, యూనిఫాం మీద వచ్చిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేశంతో మాట్లాడిన ఆయన, “జగన్... నా బట్టలు ఊడదీస్తావా? ఇవి నువ్వు ఇచ్చినవి కావు. కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది” అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు.

తన పాత్రను తక్కువగా చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేసిన సుధాకర్, పోలీసు శాఖను ప్రశ్నించేలా చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. “ఇది అరటి తొక్క కాదు.. ఎవడైనా వచ్చి ఊడదీయటానికి. ఇది నా కష్టంతో సంపాదించుకున్న గౌరవం” అని పేర్కొన్నారు.

జగన్ మాటలు ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ విస్తృతంగా పంచబడుతోంది. ఇదే సమయంలో అధికార విధుల్లో ఉన్న వ్యక్తుల ఇలాంటి స్పందనలు నైతికంగా సరైందా అనే చర్చ కూడా మొదలైంది.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి నెలకొంది. కాగా, సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థలో ఉద్యోగ గౌరవం, వ్యక్తిగత నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా