డేట్ ఫిక్స్.. ఇక దబిడిదిబిడే....

By Ravi
On
డేట్ ఫిక్స్.. ఇక దబిడిదిబిడే....

- కొత్త పార్టీ ప్రకటనకు డేట్ ఫిక్స్ చేసిన కవిత
- సభాస్థలి కోసం నేతల పరిశీలన
- లక్షల్లో జనాలను రప్పించేందుకు సిద్ధమైన నేతలు
- పార్టీ సస్పెండ్ కంటే ముందే బయటకు రావాలని డిసైడ్

డేట్ ఫిక్స్ అయ్యింది.. శంఖారావం పూరించేందుకు అక్క సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ధూమ్..ధామ్ చేసేందుకు రెడీ అయ్యింది. లక్షల్లో జన సమీకరణకు వేలయ్యింది. మండలాలు.. జిల్లాల వారిగే నేతలు సిద్ధమైనారు.. ఆ డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. వరుసగా జరుగుతున్న సమీక్షలో తేదీ తెలిసే సరికి అందరూ క్యాలెండర్ వైపు చూస్తున్నారు. ఎవరికి వారు జన బల ప్రదర్శనకు సిద్ధమైనారు.
తెలంగాణ జాగృతి పార్టీకే అందరూ జై కొట్టారు. పార్టీ ఆవిర్భావం ఆషామాసిగా ఉండేలా కాకుండా హైదరాబాద్ నిండిపోయేలా ఉండాలని ఏర్పాట్లలో నేతలు బిజీ అయ్యారు. జూన్ 2వ తేదీన కవిత కుండలు బద్దలు కొట్టనుంది అనే సరికి నేతలే కాదు ఆమె జెండా అజెండా కోసం జనాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిళలకు తన పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కవిత చూస్తున్నట్లు తెలుస్తోంది. బాపు పార్టీ దూతలను పంపి చేసిన బుజ్జగింపులు విఫలం అయినట్లు తెలియడంతో ఆమె వెన్నంటి వచ్చే నేతల్లో ఆశ చిగురించింది. మొత్తం సిటీ కలర్ఫుల్ గా మార్చేందుకు పార్టీ జెండాలు సిద్ధం చేస్తున్నారు. అమరవీరుల స్థూపం వద్ద పార్టీ అనౌన్స్ మెంట్ చేసినా బహిరంగ సభకు అనువుగా వుండే వేదిక ప్రాంతాలను ఇప్పటికే కొందరు సీనియర్ నాయకులు పరిశీలిస్తున్నారు.
కవిత చరిష్మా చూపించేందుకు సొంత పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు నిద్ర కరవయ్యేలా పార్టీ ప్రకటన ఉండాలని నిర్ణయించారు. కవిత స్థలం ఫిక్స్ చేయగానే పోలీస్ పర్మిషన్, పార్కింగ్ సదుపాయాలు, వచ్చే జనాలకు ఏర్పాట్లకు సిద్ధమైనారు. ఇప్పటికే తన ఇంటికి క్యూకట్టిన నేతలకు సరైన పదవులు, పార్టీ బాధ్యతల కేటాయింపులో కవిత బిజీ అయ్యారు. సింగరేణి జాగృతి నేతలతో సమావేశం అయి కమిటీలను సైతం రూపొందించారు. పార్టీ ప్రకటన తరువాత తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఊరులో పాదయాత్ర చేసి జనాల మద్దత్తు కూడగట్టుకొని ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ కూడా రూపొందించుకుంది. పార్టీ సస్పెండ్ చేసే లోపే తానే బయటకి వచ్చి సొంత పార్టీ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యింది. ఇదిలావుంటే కవిత పార్టీ తమకు ఏమి నష్టం లేదని బిఆర్ఎస్ చీలిపోయి ఖాళీ కావడం ఖాయమని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి కవిత మొండి ధైర్యతోనే అడుగు ముందుకు వేసిందని తెలుస్తోంది.

Advertisement

Latest News