పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో భూకంపం

By Ravi
On
పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో భూకంపం

పాకిస్థాన్‌ లో తాజాగా భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడి అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం తీవ్రత 5.8 గా నమోదు చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వచ్చిన తీవ్ర స్థాయి భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. 

అయితే 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తింపబడినట్లుగా తెలిపింది. కాశ్మీర్ వరకు ప్రకంపనలు సంభవించాయని పలు అధికార నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. అయితే హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా మాత్రం కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Latest News

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య  శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య 
అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం
సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్‌ నేతల సహపంక్తి భోజనం..!
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
మల్కాజిగిరి: రజతోత్సవ సభ విజయవంతానికి ప్రజల మద్దతు కోరిన కేటీఆర్
కొడుకు మార్క్ శంకర్ తో సింగపూర్ నుండి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్
రూ. 60 లక్షల విలువైన గంజాయి పట్టివేత