HCU భూముల పరిరక్షణకు కృషి - ఎంపీ వద్దిరాజు

By Ravi
On
 HCU భూముల పరిరక్షణకు కృషి - ఎంపీ వద్దిరాజు


బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయు)భూములు అన్యాక్రాంతం కాకుండా,వాటి పరిరక్షణకు తన వంతు కృషి సల్పుతున్నారు. గచ్చిబౌలి వద్ద నెలకొన్న ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఉన్న భూముల్లో 400 ఎకరాలను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.అత్యంత విలువైన ఈ భూములను పరిరక్షించాల్సిన అవసరం గురించి మొన్న రాజ్యసభలో  మాట్లాడిన ఎంపీ రవిచంద్ర, నిన్న సహచర ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులతో పాటు సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతిపత్రం అందజేయడం  తెలిసిందే.అలాగే, ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో యూనివర్సిటీ భూముల అంశాన్ని తిరిగి లేవనెత్తారు.ఈ సందర్భంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవాలని చూసినా  కూడా ఆయన ఏ మాత్రం  వెనుకడు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు వైఖరిని ఎండగట్టారు.విద్యా,పరిశోధనా, నైపుణ్యాభివృద్ధికి,విద్యార్థుల భవిష్యత్తు అవసరాల కోసం యూనివర్సిటీకి చెందిన విలువైన ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు అన్నారు.హెచ్ సీయు క్యాంపస్ లోని ఈ భూముల్లో నీటి వనరులతో పాటు అరుదైన వృక్ష సంపద,పక్షి జాతులు,భారీ రాళ్ల వరుసలు, జింకలు,మన జాతీయ పక్షి అయిన నెమళ్లు,తాబేళ్లు, సరీసృపాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని,వాటి మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నదని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.చక్కని జీవవైవిధ్యంతో కూడిన ఇక్కడ నుంచే కాంక్రీట్ జంగల్ గా మారిన పరిసర ప్రాంతాలకు సహజ వాయువు లభిస్తున్నదని తెలిపారు. ఇటువంటి భూముల్ని వేలం వేసేందుకు గాను అందులో ఉన్న భారీ వృక్షాలను రాత్రిపగలు అనే తేడా లేకుండా జేసీబీలు,ప్రొక్లైనర్లతో యధేచ్ఛగా నర్కేస్తున్నారని,వద్దని అడ్డుపడుతున్న విద్యార్థులు,అధ్యాపకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా సభకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.కూడా చెట్లను నర్కేస్తు పచ్చదనాన్ని, పర్యావరణాన్ని విధ్వంసం చేసే హక్కు ఎవరికి కూడా లేదని,ఈ భూములను వేలం వేయకుండా, అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిందిగా  ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.

Tags:

Advertisement

Latest News