ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి

By Ravi
On
ప్రమాదంలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ: పంజర్లి

కాంతార.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఊహించని సంచలనం క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి డైరెక్టర్ కమ్ నటుడిగా తన ప్రతిభను గుర్తించేలా చేసింది. ఈ సినిమా కన్నడలోనే కాకుండా అన్ని భాషల్లో అద్భుతమైన కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఆయన కాంతార మూవీకి ప్రీక్వెల్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు 200 కోట్ల బడ్జెట్ ను ఎఫర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా రిషబ్ శెట్టి ఫ్యామిలీకి శత్రువుల నుండి ముప్పు ఉందని, పంజర్లీ వారాహి హెచ్చరించడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. 

రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్ లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పంజుర్లీ మాట్లాడుతూ.. నీకు చాలామంది శత్రువులున్నారు.. వాళ్లు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. కానీ మీకు ఎలాంటి హానీ జరగకుండా చూసుకుంటానని, రానున్న 5 నెల్లలో మంచి చేస్తానని రిషబ్ కు అభయం ఇచ్చారు. ఇక కాంతార ప్రీక్వెల్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..