బాలయ్య నెక్ట్స్ సినిమా డైరెక్టర్ ఎవరంటే?

By Ravi
On
బాలయ్య నెక్ట్స్ సినిమా డైరెక్టర్ ఎవరంటే?

బాలయ్య ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక స్టైలిష్ మాస్ కమర్షియల్ హిట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. నెక్ట్స్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 పై ఫోకస్ చేశారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ బిజీగా సాగుతుంది. ఈ మూవీని ఈ ఇయర్ దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అఖండ పార్ట్ 1 లానే ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు పెంచుకున్నారు. ఇప్పుడు బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టారు. 

అయితే ఆయన నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ లో గోపిచంద్ మలినేని, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కథలు వినిపించారట. అయితే ఇందులో గోపిచంద్ మలినేనితో సినిమా చేయాలని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ బాలయ్య బర్త్ డే స్పెషల్ గా రాబోతుంది. ఈ మూవీలో బాలయ్య లుక్ అండ్ గెటప్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఈ సారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్‌ లో ఉన్నారట. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!