ఆయిల్ ధరలపై ట్రంప్ కౌంటర్..

By Ravi
On
ఆయిల్ ధరలపై ట్రంప్ కౌంటర్..

డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారీఫ్ లతో ఎన్నో వ్యాపార రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. ఒకవైపు ముడి చమురు ధరలు డౌన్ అయిపోతున్నాయి. ఈ విషయంలో రష్యా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఆయిల్ ఉత్పత్తుల నుండి వచ్చే ఆదాయంపైనే రష్యా ఎక్కువగా ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ సంక్షోభానికి తీవ్రస్థాయిలో అక్కడి గవర్నమెంట్ ఆందోళనను ఎదుర్కుంటుంది. సుంకాల ఎఫెక్ట్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ లో తాజాగా క్రూడ్ ఆయిల్ బ్యారల్ రేట్ ఏకంగా 64 డాలర్లకు డౌన్ అయ్యింది. మరోపక్క టెక్సాస్ కూడా క్రూడ్ రూట్ 60 డాలర్లకు డౌన్ అయ్యింది. 

ఈ క్రమంలో రష్యా ఉరల్స్ ఆయిల్ రేట్ కూడా భారీ స్థాయిలో పతనమైంది. గత శుక్రవారం నాడు బ్యారల్ ధర 52 డాలర్లుగా ఉంది. అది కాస్త నిన్న మార్కెట్ రేట్ కు 50 డాలర్ల కు డౌన్ అయ్యింది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు, గ్యాస్ ల నుండి ఈ విధమైన రేట్లు పడిపోవడంతో మరింత ఆందోళనకు గురవుతుంది. ఇక ఈ ఏడాదిలో ఆయిల్ రంగం నుండి గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే 17 శాతం ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ నుండి ఈ నష్టం మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఈ క్రమంలో రష్యా అలర్ట్ అవుతుంది. ఆయిల్ రేట్స్ పడిపోవడం అనేది రష్యా బడ్జెట్ కు ప్రతికూలం అని, అయితే అన్నింటిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..! ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
హైదరాబాద్‌ శేరిలింగంపల్లి బయోడైవర్సిటీ జోనల్ కార్యాలయంలో.. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో.. డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇంచార్జ్‌గా...
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
సూడాన్‌లో 300 మంది పౌరులు మృతి
ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్.. 
బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా కామెంట్స్..
ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్..
సీఎం హైజాక్‌ అయ్యారు : తేజస్వి యాదవ్‌