అమెరికాపై దారుణమైన టారిఫ్ లను విధిస్తున్న చైనా

By Ravi
On
అమెరికాపై దారుణమైన టారిఫ్ లను విధిస్తున్న చైనా

ప్రపంచదేశాల్లోని అగ్రరాజ్యం అయిన అమెరికా, చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుతుంది. ఒకరిపై మరొకరు పోటీగా టారీఫ్ లను పెంచుకుంటూ పోతున్నారు. చైనాపై అమెరికా 145 శాతం రివేంజ్ టారీఫ్ లు విధిస్తే.. చైనా కూడా తన స్టైల్ లో రిప్లై ఇస్తుంది. అమెరికా దిగుమతులపై ఇంతకుముందు 84 శాతంగా టారిఫ్ లు ఉండేవి. ఇప్పుడు ఆ టారీఫ్ 125 శాతానికి పెంచింది. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. తాజాగా పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై చైనా కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తుంది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. 

కాగా ఈ ఘటనపై ఆగ్రహించిన ట్రంప్‌ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ చైనాకు వార్నింగ్‌ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి. అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ట్రంప్‌ వార్నింగ్స్ ని కనీసం చైనా పట్టించుకోవట్లేదు. దీంతో ట్రంప్ మరో 21 శాతం పెంచారు. ఇలా మాటా మాటా పెరిగినట్లు.. టారీఫ్ లు టారీఫ్ లను పెంచుకుంటూ ఒకరిపై మరొకరు కౌంటర్స్ వేసుకుంటున్నారు.

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!