హెలికాప్టర్ క్రాష్.. ముగ్గురు మృతి
జపాన్ లో ఓ మెడికల్ ట్రాన్స్‌పోర్టు హెలికాప్టర్ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆ దేశ నైరుతీ దిశలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పేషెంట్ తో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పైలట్ హిరోషి హమదా, హెలికాప్టర్ మెకానిక్ కజుటో, 28 ఏళ్ల నర్సు సకురా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గుర్నీ కోస్టు గార్డులు రెస్క్యూ చేశారు. కాగా ఈ ఘటనలో ముగ్గురూ హైపోథర్మియాతో బాధపడ్డారు. కానీ స్పృహలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో మెడికల్ డాక్టర్ కీవ్ అరకావా, పేషెంట్ మిత్సుకీ మోటోషి, ఆ పేషెంట్ కేర్‌టేకర్ కజుయోషి మోటిషి ఉన్నారు.
ఆ ముగ్గురి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్ దిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ రికవరీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు విమానాలు, మూడు నౌకలను కోస్టు గార్డులు మోహరించారు. నాగసాకి జిల్లా నుంచి ఫుకునోవా హాస్పిటల్‌కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో దర్యాప్తులో తేలాల్సి ఉన్నది. కాగా బాధిత కుటుంబాలకు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.