2030 సంవత్సరానికి ఏఐకి హ్యుమన్ ఆలోచనలు?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏఐ హవా కొనసాగుతున్నాయి. ఈ ఏఐ అన్ని రంగాల్లోనూ సంచలన మార్పులు తీసుకువస్తుంది. ఈ క్రమంలో ఏఐ మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే మనుషులకు అంతకు మించిన నష్టాల్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండకపోతే మానవాళిని సైతం అంతరించే శక్తి ఏఐకు వస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మానవ కృత్రిమ మేధస్సుగా పిలిచే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 2030 నాటికి పూర్తి స్థాయిలో వస్తుందని, ఇది మానవాళిని సమూలంగా నాశనం చేస్తుందని గూగుల్ డీప్ మైండ్ లేటెస్ట్ పరిశోధనలు చేసి ఈ అంచనాలు తెలిపింది. ఈ క్రమంలో ఏజీఐ ప్రభావం కూడా తీవ్రమైన హాని కలిగిస్తుందని వారు అంచనా వేస్తున్నట్లు గ్రహించారు.
ఈ క్రమంలో మానవాళిని పూర్తిగా నాశనం చేసే ప్రమాదాలు ఉన్నాయని అన్నారు. అయితే ఈ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఏఐ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని.. నిపుణులు పరిశోధనలో హెచ్చరించారు. అయితే డేటాను దుర్వినియోగం చేయడం, తప్పులు, తప్పుడు డేటా ఎంట్రీ చేయడం లాంటి ముప్పులు ఉన్నాయని సైంటిస్టులు వివరిస్తున్నారు. అంతేకాకుండా మనుషుల కంటే తెలివైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటిలిజెన్స్ రాబోతోందని డీప్ మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఇది జరుగుతుందని అన్నారు.