ఇషాంత్ శర్మకు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ ఫైన్ విధించింది. ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్ చేశారు. అంతేకాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇషాంత్ అకౌంట్ లోకి వెళ్లింది. ఇది తన కెరీర్ కు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అవుతుంది. మరి దీనికి కారణం ఏంటంటే.. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో.. ఐపీఎల్ నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇషాంత్ శర్మ బ్రేక్ చేశారని బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ ఓ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. ఐపీఎల్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించిన లెవల్ 1 అఫెన్స్‌కు ఇషాంత్ పాల్పడ్డారు. క్రికెట్ సామాగ్రిని, కానీ దుస్తుల్ని కానీ, గ్రౌండ్ ఈక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదగా బిహేవ్ చేస్తే.. ఆర్టికల్ 2.2 కింద ఫైన్ వేస్తారు.
అయితే లెవల్ 1 నేరాన్ని ఇషాంత్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఫైన్ ను అంగీకరించాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నెగ్గినా.. ఆ మ్యాచ్‌లో ఇషాంత్ భారీగా పరుగులు సంపాదించుకున్నారు. కేవలం నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చేశాడు. 13 ఓవర్ల తర్వాత ఫీల్డింగ్‌లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇషాంత్ ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు నమోదు చేశారు.